తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP Jagarana Deeksha: కరీంనగర్​లో బండి సంజయ్​ దీక్ష.. భారీగా మోహరించిన పోలీసులు - ts news

BJP Jagarana Deeksha: కరీంనగర్‌లో భాజపా చేపట్టిన దీక్ష ఉద్రిక్తంగా మారింది. దీక్షకు అనుమతి లేదని శిబిరాన్ని ఎత్తివేయాలంటూ పోలీసులు ఎంపీ కార్యాలయం వద్ద మోహరించారు. భాజపా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ భాజపా శ్రేణులు ఆందోళనకు దిగారు.

BJP Jagarana Deeksha: కరీంనగర్​లో బండి సంజయ్​ దీక్ష.. భారీగా మోహరించిన పోలీసులు
BJP Jagarana Deeksha: కరీంనగర్​లో బండి సంజయ్​ దీక్ష.. భారీగా మోహరించిన పోలీసులు

By

Published : Jan 2, 2022, 9:45 PM IST

BJP Jagarana Deeksha: కరీంనగర్​లో బండి సంజయ్​ దీక్ష.. భారీగా మోహరించిన పోలీసులు

BJP Jagarana Deeksha: ఉద్యోగుల కేటాయింపు జీవో 317ను నిరసిస్తూ... ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్‌లో ఆదివారం రాత్రి ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జాగరణ దీక్ష చేయడానికి సిద్ధమయ్యారు. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో అనుమతి లేకపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో భాజపా కార్యకర్తలు.. పోలీసులు, సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈక్రమంలో ఎంపీ బండి సంజయ్‌ ద్విచక్రవాహనంపై క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆయన్ను చుట్టుముట్టారు. పోలీసుల వలయాన్ని చేధించుకొని ఆయన కార్యాలయంలోకి వెళ్లారు. కార్యాలయ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఉద్రిక్తత...

భాజపా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ భాజపా శ్రేణులు ఆందోళనకు దిగారు. భాజపా కార్యకర్తలు.. పోలీసులు, సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తీవ్రంగా ఖండించిన బండి సంజయ్​...

పోలీసులు దీక్షను అడ్డుకోవడాన్ని బండి సంజయ్​ తీవ్రంగా ఖండించారు. నల్గొండలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు అనుమతించిన పోలీసులు తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 317జీవో వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోందని, సొంత జిల్లాలో కూడా పరాయివాడిగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. జీవోను సవరించి, అందుకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. బండి సంజయ్‌ కార్యాలయం లోపల దీక్ష కొనసాగిస్తున్నారు. పోలీసులు భారీగా మోహరించి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్‌ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. బండి సంజయ్‌ జాగరణ దీక్షకు ఎలాంటి అనుమతి కోరలేదని కరీంనగర్‌ సీపీ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేనందున మీడియా కవరేజ్‌ ఇవ్వొద్దని సీపీ కోరారు.

ఇదీ చదవండి:

BJP Jagarana deeksha : 'నిద్రపోతున్న సర్కారును మేల్కొల్పేందుకే జాగరణ దీక్ష'

ABOUT THE AUTHOR

...view details