చేయని తప్పులను ఒప్పుకోవాలని తమ కార్యకర్తలను కరీంనగర్ పోలీసు కమిషనర్ కమల్హసన్రెడ్డి విచక్షణా రహితంగా కొట్టాడని భజరంగ్‌దళ్ ఆరోపించింది. ఈ నెలలోనే ఏడుగురిని హెడ్ క్వార్టర్స్‌కి పిలిపించి విచక్షణారహితంగా కొట్టినట్లు జోనల్ కన్వీనర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. చెప్పినట్లు వినకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, అనవసరంగా జైల్లో పెట్టారని చెప్పారు. వేధింపులు ఇలాగే కొనసాగితే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'భజరంగ్‌దళ్ కార్యకర్తలకు సీపీ వేధింపులు' - kamal hasan reddy
కరీంనగర్ పోలీస్ కమిషనర్ పత్రికల్లో తప్పుడు ప్రకటనలిస్తూ తమ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని భజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది.
'భజరంగ్‌దళ్ కార్యకర్తలకు సీపీ వేధింపులు'