కరీంనగర్‌లో ఆయుష్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి ఈటల
కరీంనగర్‌లో రూ.60 లక్షలతో నిర్మించిన ఆయుష్ ఆస్పత్రిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఉత్తమ వైద్య సేవలు అందించడంలో తెలంగాణ ముందు వరుసలో ఉందని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌లో రూ.60 లక్షలతో నిర్మించిన ఆయుష్ ఆసుపత్రిని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఉత్తమ వైద్యసేవలు అందించడంలో ఇంతకు ముందు కేరళ, తమిళనాడు రాష్ట్రాలు మొదటి వరుసలో ఉండేవని.. ప్రస్తుతం తెలంగాణ వాటి సరసన చేరిందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సర్కార్ ఆసుపత్రులను పట్టించుకోకపోవడం వల్ల దవాఖానాలు వెలవెల పోయేవని ఎద్దేవా చేశారు. వైద్య రంగంతో అనుబంధంగా ఉన్న ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, ప్రకృతి వైద్యం, అల్లోపతిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.
TAGGED:
eetala rajender