ఒక్క ఓటు ఐదు సంవత్సరాలు మనల్ని ఎవరు పాలించాలో నిర్ణయిస్తుందని... అందుకే ఓటును అమ్ముకోకుండా సరైన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించు కోవాలని కరీంనగర్ పట్టణ ప్రజలను కోరారు సామాజిక కార్యకర్త కోలా శ్యామ్ కుమార్. 'ఓటే మీ ఆయుధం'.. డబ్బుకు, మందుకు లొంగకుండా ఉండాలని ప్రజలకు చెబుతూ ముందుకు సాగుతున్నారు.
'డబ్బు, మందు, దొంగ ప్రేమలకు లొంగకండి' - కరీంనగర్ ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన
కరీంనగర్ ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు సామాజిక కార్యకర్త కోలా శ్యామ్ కుమార్. రోడ్డుపై నిల్చొని చైతన్య కరపత్రాలు పంచుతూ... ఓటు విలువను తెలియజేస్తున్నారు.
'డబ్బు, మందు, దొంగ ప్రేమలకు లొంగకండి'
అమ్మ, అక్క, తమ్ముడు, చెల్లి అంటూ ఎన్నికల ముందు వచ్చి ఎనలేని దొంగ ప్రేమ చూపుతారని... ఆ ప్రేమకు లొంగకుండా నిజాయితీపరులైన వారికే ఓటు వేసి గెలిపించాలని శ్యామ్ కుమార్ ఓటర్లకు సూచిస్తున్నారు. రోడ్డు మీద పోయే ప్రజలందరికీ చైతన్య కరపత్రాలు అందిస్తూ... ఓటు విలువ గురించి వివరిస్తున్నారు.
ఇవీ చూడండి: పోలీస్ స్టేషన్లో గాజుముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం