ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ పేర్కొన్నారు. జిల్లాలోని సైదాపూర్ మండలంలోని వెన్కేపల్లి గ్రామంలో విశాల పరపతి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొండి' - enka Leverage Co-operative Society in Venkepalli village
కరీంనగర్ జిల్లా వెన్కేపల్లి గ్రామంలో విశాల పరపతి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నడవాలంటే రైతులు సకాలంలో ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నడవాలంటే రైతులు సకాలంలో ధాన్యాన్ని తీసుకు రావాలన్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వెరైటీ ధాన్యాలను సైదాపూర్ మండలంలోని రైతులు పండించారని.. అందువల్ల 60 కిలోల బస్తాకు 40 కిలోల బరువు మాత్రమే తూకం వచ్చి రైతులు నష్టాలకు గురయ్యారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ముందుచూపుగా 1010 విత్తనాలను రైతులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం క్వింటాలుకు రూ.1885 రూపాయల మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. ఒకప్పుడు సైదాపూర్ మండలం కరువు మండలంగా ఉండేదని కానీ ప్రస్తుతం యాసంగిలో సైతం కాలువ ద్వారా వస్తున్న సాగు నీటితో చెరువులు జలకళ సంతరించుకుని బ్రహ్మాండంగా వరిపంటను సాగు చేస్తున్నామన్నారు. ఆ కాలువకు భూమి ఇచ్చిన రైతుల త్యాగాన్ని గుర్తించాలన్నారు. ప్రస్తుత యాసంగిలో కొనుగోలు కేంద్రాలకు ఒకటిన్నర రెట్లు అధికంగా ధాన్యం వస్తుందన్నారు.
ఇదీ చదవండి:తొలిసారి ఓటు వేయలేకపోయిన ములాయం