తెలంగాణ

telangana

ETV Bharat / state

'వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం' - ఆందోళన

కరీంనగర్​ కలెక్టర్​ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గత ఐదు నెలలుగా పెండింగ్​లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

'వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం'

By

Published : Sep 23, 2019, 6:03 PM IST

ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని కరీంనగర్​లో సిఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. గత ఐదు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సరిసమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం చూపుతోందని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని.. లేకుంటే అక్టోబర్ 14న హైదరాబాదులో ఇందిరా గార్డెన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బండారి శేఖర్ హెచ్చరించారు.

'వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం'

ABOUT THE AUTHOR

...view details