కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి సర్పంచ్ జవ్వాజి శేఖర్.. కరోనా పరీక్ష(covid test) చేయించుకునే సమయంలో ముక్కులో స్క్వాబ్ విరిగింది. దీంతో ఆందోళనకు గురైన ఆయన వైద్యం కోసం పరుగులు తీశాడు.
covid test: కరోనా టెస్టు సమయంలో ముక్కులో విరిగిన స్క్వాబ్ - కరీంనగర్ జిల్లా
కొవిడ్ పరీక్షల్లో భాగంగా ఓ సర్పంచ్‌కు టెస్టు(covid test) చేస్తున్న క్రమంలో అతని ముక్కులో స్క్వాబ్ చిక్కుకుంది... తీసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఆ స్క్వాబ్ ముక్కులోనే విరిగిపోయింది. దీంతో దానిని తీసేందుకు స్థానికంగా వైద్య సదుపాయంలేక పోవటంతో... కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎండోస్కోపి ద్వారా దానిని బయటకు తీశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
corona test
కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎండోస్కోపి ద్వారా విరిగిన పుల్లను వెలికి తీశారు. ప్రమాదం నుంచి క్షేమంగా బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి:Rare surgery: బాలిక కడుపులో 2 కిలోల వెంట్రుకల ముద్ద గుర్తింపు
Last Updated : Jun 11, 2021, 6:42 PM IST