తెలంగాణ

telangana

ETV Bharat / state

వేగంగా ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం.. వ్యక్తి మృతి - thimmapur road accident news today

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రాజీవ్ రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రం పరిధిలోని యాదవుల పల్లెకు చెందిన పెంటం ఐలయ్య (36) ద్విచక్ర వాహనంతో నుస్తులాపూర్ నుంచి గ్రామానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

వేగంగా ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం.. వ్యక్తి మృతి
వేగంగా ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం.. వ్యక్తి మృతి

By

Published : Sep 14, 2020, 1:29 PM IST

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రాజీవ్ రహదారిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండల కేంద్రం పరిధిలోని యాదవుల పల్లెకు చెందిన పెంటం ఐలయ్య (36) ద్విచక్ర వాహనంతో నుస్తులాపూర్ నుంచి గ్రామానికి వెళ్తుండగా ఘటన జరిగింది.

అక్కడికక్కడే మృతి..

తిమ్మాపూర్​లోని రవాణా శాఖ కార్యాలయం ఎదుట డివైడర్​ను ఢీ కొట్టాడు. అదే సమయంలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఐలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ కృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి : రెవెన్యూ సంస్కరణలు ప్రజలు ఉపయోగపడేలా ఉండాలి: వీహెచ్

ABOUT THE AUTHOR

...view details