తెలంగాణ

telangana

ETV Bharat / state

మిరప కూలీల ట్రాక్టర్ బోల్తా... ఐదుగురికి తీవ్రగాయాలు - TRACTOR ACCIDENT IN SURYAPET

సూర్యాపేట జిల్లా చిలుకూరు సమీపంలో మిరప తోటకు 22 మందితో వెళ్తున్న ట్రాక్టర్​ బోల్తాపడింది. నిబంధనలకు విరుద్ధంగా ఆటోల్లో, ట్రాక్టర్లలో పెద్ద సంఖ్యలో కూలీలను ఎక్కిస్తూ... ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

22 LABOURS FILLED TRACTOR CAUGHT AN ACCIDENT AT CHILKUR
22 LABOURS FILLED TRACTOR CAUGHT AN ACCIDENT AT CHILKUR

By

Published : Feb 29, 2020, 1:11 PM IST

సూర్యాపేట జిల్లా చిలుకూరు సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాల రోడ్డుప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన 22 మంది మిరప కూలీలు చింతలపాలెం గ్రామానికి పనికి వెళ్తున్నారు. ఇంజినీరింగ్​ కళాశాల వద్దకు రాగానే ఒక్కసారిగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగితావారికి స్వల్ప గాయాలయ్యాయి.

ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను హుజూర్​నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మిరప కూలీల ట్రాక్టర్ బోల్తా... ఐదుగురికి తీవ్రగాయాలు

ఇదీ చదవండి:ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details