తెలంగాణ

telangana

ETV Bharat / state

మురికి కాల్వలను శుభ్రం చేసిన మహిళా కౌన్సిలర్ - కామారెడ్డి జిల్లా

ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం లోపించింది. ఆ విషయాన్ని స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. లాభం లేకపోయింది. దీంతో 9వ వార్డుకు చెందిన మహిళా కౌన్సిలర్.. తానే స్వయంగా కాలువలను శుభ్రం చేశారు.

Woman councilor cleaning dirty sewers in yellareddy kamareddy
మురికి కాల్వలను శుభ్రం చేసిన మహిళ కౌన్సిలర్

By

Published : Feb 4, 2021, 5:05 PM IST

పారిశుద్ధ్య నిర్వాహణ సక్రమంగా లేకపోవడంతో.. ఓ మహిళా వార్డు కౌన్సిలర్ పార పట్టారు. అధికారులను అభ్యర్థించినా.. సిబ్బందిని పంపకపోవడంతో, తానే స్వయంగా మురికి కాలువలను శుభ్రం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఈ ఘటన జరిగింది.

కాలువలు నిండుకోవడంతో గత కొద్ది రోజులుగా 9వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దోమల ద్వారా.. వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. అధికారులు, ఛైర్మన్​లను అభ్యర్థించినా.. సిబ్బందిని పంపడం లేదు.

- వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి

ఇదీ చదవండి:బాలికపై హత్యాచారం- అడ్డొచ్చిన ఇద్దరు హత్య

ABOUT THE AUTHOR

...view details