తెలంగాణ

telangana

ETV Bharat / state

8 న కామారెడ్డిలో యూపీ సీఎం ఎన్నికల ప్రచారం - ఉత్తర ప్రదేశ్​ సీఎం

ఈ నెల 8న కామారెడ్డి జిల్లాలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. లింగ రెడ్డిపేటలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

8 న కామారెడ్డిలో యూపీ సీఎం ఎన్నికల ప్రచారం

By

Published : Apr 6, 2019, 6:44 AM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఆదివారం ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అనంతరం లింగ రెడ్డిపేట గ్రామ శివారులోని బస్ డిపో స్థలంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభ ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర భాజపా అభివృద్ధి కమిటీ చైర్మన్ మురళీధర్ గౌడ్ పరిశీలించారు. మధ్యాహ్నం 11 గంటలకు సభ ప్రారంభం అవుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. భాజపా ఎంపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

8 న కామారెడ్డిలో యూపీ సీఎం ఎన్నికల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details