కామారెడ్డి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ (Cm Kcr) ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ ప్రగతిని వివరిస్తూనే ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరచుకుపడ్డారు.
Cm Kcr Story: సీఎం కేసీఆర్ చెప్పిన కలియుగ రాక్షసుల కథ - సీఎం కేసీఆర్ పిట్టకథ
జిల్లాల పర్యటనలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పర్యటించారు సీఎం కేసీఆర్ (Cm Kcr). ముఖ్యమంత్రి ప్రసంగం అంటే ఎవరైనా సరే ఆసక్తిగా వినాల్సిందే. అలాంటి వక్త ఏదైనా అంశం గురించి మాట్లాడుతుంటే ఎలాంటి వారైనా సరే శ్రద్ధగా వింటారు. అసలు ఆయన ఏం చెప్పారంటే?
సుధీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్ (Cm Kcr )... రాష్ట్రంలో ప్రతిపక్షాలను రామాయణంలోని రావణాసురుడి సైన్యం, రాక్షసులతో పోల్చిన చెప్పిన కథ ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్వించింది. అర్ధయాష్షు రాక్షసులు.. కలియుగంలో కూడా ఉన్నారని, రాష్ట్రంలో కూడా వాళ్లు అక్కడక్కడ ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. రాక్షసుల గురించి సీఎం వర్ణించిన తీరు అక్కడున్న వారిని కట్టిపడేసింది. ఆసక్తిగా వింటూ కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. మీరూ కూడా వినండి.
ఇదీ చూడండి: Cm Kcr: కామారెడ్డికి మెడికల్ కాలేజీ... నాదీ పూచీ