తెలంగాణ

telangana

ETV Bharat / state

పాజిటివ్​ వచ్చిన వారి ప్రాంతాల్లో అప్రమత్తం - కరోనా బాధితులు పరిసరాల్లో చర్యలు కట్టుదిట్టం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో పర్యటించి క్వారంటైన్​లో ఉన్నవారికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. రహదారులపై రసాయనాలు స్ప్రే చేశారు.

The alert in their areas of corona positives
పాజిటివ్​ వచ్చిన వారి ప్రాంతాల్లో అప్రమత్తం

By

Published : Apr 1, 2020, 10:45 AM IST

కరోనా బాధితులు ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో కరోనా సోకిన వ్యక్తి ఇంటి పరిసరాల్లో రసాయనాలు పిచికారి చేశారు. వైద్య, పోలీసు ఇతర శాఖల అధికారులు గ్రామంలో పర్యటించి క్వారంటైన్​లో ఉన్న వారికి నిత్యావసరాలు అందించేందుకు 25 మంది సిబ్బందిని నియమించారు.

గ్రామస్థులకు కావాల్సిన సరుకులను మున్సిపల్ సిబ్బంది ద్వారా తెప్పించి ఇస్తున్నారు. అలాగే గ్రామంలోని ప్రధాన రహదారిలో అగ్నిమాపక యంత్రం ద్వారా బ్లీచింగ్ స్ప్రే చేశారు.

పాజిటివ్​ వచ్చిన వారి ప్రాంతాల్లో అప్రమత్తం

ఇదీ చదవండి:'మీ వల్లే కరోనా ప్రభావిత ప్రాంతాలు పెరిగాయి'

ABOUT THE AUTHOR

...view details