తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీపై ప్రభుత్వం దుష్ప్రచారం: కోదండరాం

ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణమని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని కోదండరాం ఆరోపించారు. కార్మికుల సమస్య తీరేదాకా తాము అండగా ఉంటామన్నారు.

ఆర్టీసీపై ప్రభుత్వం దుష్ప్రచారం: కోదండరాం

By

Published : Oct 23, 2019, 9:22 PM IST


కామారెడ్డి జిల్లా కేంద్రంలో 19వ రోజు ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం కార్మికులకు మద్దతు తెలిపారు. సమ్మె పట్ల ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులు, యూనియన్లే కారణమని బూచి చూపి.. యూనియన్లు లేని ఆర్టీసీ కావాలని ప్రభుత్వం చెప్తోందన్నారు. ప్రతి సంవత్సరం ఆర్టీసీ ద్వారా సర్కారుకు 8 నుంచి 900 కోట్లు ఆదాయం వస్తోందన్నారు. బస్ పాస్​ రాయితీలపై 500 కోట్లు రావాలని పేర్కొన్నారు. ఆర్టీసీ కంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం తక్కువైనప్పుడు నష్టాలకు కార్మికులు ఎలా కారణమవుతారని మండిపడ్డారు. సమస్య పరిష్కారం అయ్యేదాకా తాము అండగా ఉంటామని కోదండరాం హామీ ఇచ్చారు.

ఆర్టీసీపై ప్రభుత్వం దుష్ప్రచారం: కోదండరాం

ABOUT THE AUTHOR

...view details