తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్వచ్ఛ సర్వేక్షణ్​లో మొదటి స్థానం కోసం సమష్టి కృషి అవసరం' - తెలంగాణ వార్తలు

కామారెడ్డి మున్సిపాలిటీ వద్ద స్వచ్ఛ సర్వేక్షణ్ 2కే ర్యాలీని కలెక్టర్ శరత్ జెండా ఊపి ప్రారంభించారు. స్వచ్ఛ సర్వేక్షణ్​ కార్యక్రమాల్లో మొదటి స్థానం కోసం సమష్టి కృషి అవసరమని చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు.

swachh sarvekshan 2k rally at municipality in kamareddy district
మొదటి స్థానం కోసం సమష్టి కృషి అవసరం: కలెక్టర్ శరత్

By

Published : Feb 7, 2021, 10:22 AM IST

Updated : Feb 7, 2021, 10:40 AM IST

స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల్లో కామారెడ్డి జిల్లాను మొదటి స్థానంలో నిలపడానికి సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ శరత్ కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని సూచించారు. తడి, పొడి చెత్తను ప్రజలు వేరు చేసి చెత్త బండికి ఇవ్వాలని పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ వద్ద స్వచ్ఛ సర్వేక్షణ్ 2కే ర్యాలీని ఆయన జెండా ఊపి శనివారం ప్రారంభించారు. ఈ ర్యాలీలో సుమారు 200 మందికి పైగా కార్మికులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, మున్సిపల్ ఛైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ ఛైర్ పర్సన్ ఇందుప్రియ, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:త్వరలో రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులు

Last Updated : Feb 7, 2021, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details