తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్కారు తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలు: వీహెచ్​పీ

గణేష్ మండపాల నిర్వహణ తీరులో ప్రభుత్వం అవలభిస్తోన్న విధానాలను నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గోపాల కృష్ణ వెల్లడించారు. సోమవారం ఉదయం 11 నుంచి ప్రతి హిందువు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు.

గణేష్ మండపాల ప్రభుత్వ తీరుపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు : విశ్వహిందూ పరిషత్
గణేష్ మండపాల ప్రభుత్వ తీరుపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు : విశ్వహిందూ పరిషత్

By

Published : Aug 23, 2020, 10:59 PM IST

గణేష్ మండపాల నిర్వహణ తీరులో ప్రభుత్వం అవలభిస్తోన్న విధానాలను నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గోపాల కృష్ణ తెలిపారు. కామారెడ్డి కేంద్రంలోని స్థానిక శిశుమందిర్​లో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాను సాకుగా చూపుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తోందని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గోపాల కృష్ణ మండిపడ్డారు.

రజాకార్లను గుర్తుకుతెస్తున్నారు...

నాటి రజాకార్ల పాలనను తలపిస్తూ మండపాల నిర్వాహకులకు ఇబ్బందులకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. భక్తితో మండపాలు ఏర్పాటు చేసుకుంటే నిమజ్జనం చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట వినకపోతే పోలీస్ కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు దుయ్యబట్టారు. సోమవారం ఉదయం 11 నుంచి ప్రతి హిందువు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.

ఇవీ చూడండి : 'నవ్య ఆస్పత్రిని మూసివేయటం ప్రభుత్వ కుట్రలో భాగమే'

ABOUT THE AUTHOR

...view details