రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా కామారెడ్డిలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్, చాకలి ఐలమ్మ, కానిస్టేబుల్ కిష్టయ్య చిత్రపటాలతో పాటు అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు.
ఎద్దేవా చేసిన నోళ్లే.. పొగుడుతున్నాయి: మంత్రి పోచారం
కామారెడ్డిలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ... ఎద్దేవా చేసిన వాళ్లు ముక్కున వేలేసుకునేలా చేశామన్నారు.
'ఎద్దేవా చేసిన వారిని ముక్కున వేలేసుకునేలా చేశాం'
నీళ్లు, నిధులు, నియామకాలు అనే త్రికార్యాల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అన్నింటినీ అందరికీ సీఎం కేసీఆర్ అందిస్తున్నారని పోచారం పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అప్పులపాలవుతుందని ఎద్దేవా చేసిన వారిని ముక్కున వేలు వేసుకునేలా అభివృద్ధి చేసిచూపించారని పోచారం తెలిపారు.