తెలంగాణ

telangana

ETV Bharat / state

వెంకటేశుని కల్యాణ వేడుకలో సభాపతి - kalyanam

తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ధర్మకర్తగా ఉన్న శాసనసభ స్పీకర్​ పోచారం స్వామి వారి కల్యాణ వేడుకల్లో కుటుంబసమేతంగా పాల్గొన్నారు.

వెంకటేశ్వర స్వామి కల్యాణ వేడుకల్లో పాల్గొన్న సభాపతి పోచారం

By

Published : Mar 15, 2019, 6:11 AM IST

Updated : Mar 15, 2019, 7:56 AM IST

వెంకటేశ్వర స్వామి కల్యాణ వేడుకల్లో పాల్గొన్న సభాపతి పోచారం
తెలంగాణ తిరుమలగా ప్రఖ్యాతి గాంచిన కామారెడ్డి జిల్లా బీర్కూర్​ మండలం తిమ్మాపూర్​లోని వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవము కన్నుల పండువగా జరిగింది. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలనడుమ అంగరంగ వైభవంగా కల్యాణ వేడుక నిర్వహించారు. ఆలయ ధర్మకర్తగా ఉన్న రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి.. సకుటుంబ సమేతంగా ఈ ఉత్సవంలో పాలుపంచుకున్నారు. ఆయనను వేద పండితులు దీవించి తమ ఆశీస్సులు అందజేశారు. కల్యాణ వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు.
Last Updated : Mar 15, 2019, 7:56 AM IST

ABOUT THE AUTHOR

...view details