మంజీరా నదిలో చిక్కుకున్న డ్రైవర్లను... గ్రామస్థులు, అధికారులు కలిసి కాపాడారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ఖత్గావ్ గ్రామ పరిధిలో జరిగింది. ప్రభుత్వ పనుల కోసం లారీల్లో ఇసుక తరలించేందుకు వచ్చిన ఆరుగురు లారీ డ్రైవర్లు మంజీరా నది మధ్యలో చిక్కుకున్నారు.
నదిలో చిక్కుకున్న డ్రైవర్లను కాపాడిన స్థానికులు, అధికారులు - Kamareddy District Khamgaon Latest News
19:10 September 26
నదిలో చిక్కుకున్న డ్రైవర్లను కాపాడిన స్థానికులు, అధికారులు
ఒక్కసారిగా భారీగా వరద నీరు రావడం వల్ల వారు అక్కడే ఉన్న ఇసుక కుప్పపై కూర్చున్నారు. పక్కనే ఉన్న వారు చూసి గ్రామస్థులు, అధికారులకు సమాచారం అందించారు.
స్థానికులు అధికారులు హుటాహుటిన వచ్చి జేసీబీ సాయంతో వారిని బయటకు తీశారు. బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి, సీఐ సాజిద్, తహసీల్దార్ వెంకట్రావు, ఎస్సై సాయన్న ఆ పనులను పర్యవేక్షించారు.
ఇదీ చూడండి :వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పని చేస్తా : లక్ష్మణ్