ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న బంధువులకు టికెట్ ఇవ్వకుండా వారిని బస్సులో కూర్చోనిచ్చిన కండక్టర్‌ను తోటి ప్రయాణికులు నిలదీయగా వారికి టికెట్ ఇచ్చిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చోటుచేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన పల్లె వెలుగు బస్ నిజాంసాగర్ నుంచి కామారెడ్డి వెళ్తోంది. తాత్కాలిక కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ బంధువులు ఎల్లారెడ్డిలో బస్సు ఎక్కగా కండక్టర్ టికెట్ తీసుకోలేదు. తోటి ప్రయాణికులు గుర్తించి అడగగా.. తమ ఊరి వాడని టికెట్ తీసుకోలేదని ప్రయాణికుడు బదులిచ్చాడు. ఆగ్రహానికి గురైన ప్రయాణికులు కండక్టర్‌ను నిలదీశారు. చేసేదిలేక అతనికి కూడా టికెట్ తీసుకున్నాడు. కామారెడ్డికి వెళ్ళాక ప్రయాణికులు డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
'మావోడే... అందుకే టికెట్ తీసుకోలేదు' - rtc strike updates
ఆర్టీసీ బస్‌లో ప్రయాణికులందరికీ టికెట్ ఇచ్చాడు. కానీ బంధువుకు మాత్రం టికెట్ ఇవ్వలేదు ఓ తాత్కాలిక కండక్టర్. గుర్తించిన ప్రయాణికులు కండక్టర్‌ను నిలదీయగా... అప్పుడు టికెట్ ఇచ్చాడు. సదురు వ్యక్తిని అడగగా కండక్టర్ మా బంధువేనంటూ బదులిచ్చాడు.
తాత్కాలిక కండక్టర్ నిర్వాకం