తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షానికి నేల రాలిన ధాన్యం గింజలు - rain in kamareddy district

అకాల వర్షానికి చేతికొచ్చిన పంట నేల పాలయింది. కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో సోమవారం కురిసిన వానకు వరి పొలాల్లో ధాన్యం గింజలు నేలరాలాయి.

rain in kamareddy
కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం

By

Published : Apr 6, 2021, 9:12 AM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్, తిమ్మారెడ్డి, కల్యాణి గ్రామాల్లో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురిచేసింది. చేతికొచ్చిన వరి పొలాల్లో ధాన్యం గింజలు నేల రాలాయి. తిమ్మారెడ్డి గ్రామంలో వడగళ్ల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం కుప్ప తడిసి ముద్దయింది.

ABOUT THE AUTHOR

...view details