తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితహారానికి ఎండిన మొక్కలతో సిద్ధం...? - plants

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం అధికారుల పర్యవేక్షణ లోపంతో నీరుగారిపోతోంది. లక్షల మొక్కలను నాటేందుకు తలపెట్టిన కార్యక్రమానికి అంతా సిద్ధంగా ఉన్నామని అధికారులు బీరాలు పోతున్నారు. ఎండిపోయిన మొక్కలతో ఎలా సిద్ధమని నర్సరీలన్నీ నోరెళ్లబెడుతున్నాయి.

హరితహారానికి ఎండిన మొక్కలతో సిద్ధం...?

By

Published : Jul 2, 2019, 12:17 AM IST


కోట్ల రూపాయలతో ప్రభుత్వం చేపట్టిన హరితహారం మరుగున పడుతుంది. నర్సరీలపై అధికారుల పర్యవేక్షణ లేక ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో నర్సరీలను చూస్తే ఈ విషయం తెలుస్తోంది. మండలంలో గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున 34 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రామ పంచాయతీకి 40వేల మొక్కలు నాటేందుకు అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. కానీ ఏ నర్సరీకి వెళ్లి చూసిన మొక్కలు మాత్రం కనిపించడం లేదు. అధికారులు మాత్రం మొక్కలు సిద్ధంగా ఉన్నాయని... హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెబుతున్నారు. మరో వారం రోజుల్లో హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతున్న దృష్ట్యా మండలంలోని సోనాల, లింబూర్, సిర్పూర్ నర్సరీలు మాత్రం మొక్కలు లేక వెలవెలబోతున్నాయి. అధికారులు చెప్పే మాటలకు... క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు కొంచెం కూడా పొంతన లేకుండా ఉంది.

హరితహారానికి ఎండిన మొక్కలతో సిద్ధం...?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details