కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం చించొల్లి గ్రామంలో నిర్మించిన పోచారం ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారింది. గతేడాది చెడిపోయిన మోటార్లను ఇప్పటికీ మరమ్మత్తులు చేయకపోవడం వల్ల పంటలకు సాగు నీరందించడం సమస్యగా మారింది. ప్రాజెక్టు మీద ఆశలు పెట్టుకున్న రైతులు.. మోటార్లు చెడిపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారు. పోచారం ఎత్తిపోతల కింద ఉన్న మోటార్లు చెడిపోవడం ద్వారా 400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ఫలితంగా పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. చేతికొచ్చిన పంటను వదిలేయలేక.. రైతులు అప్పులు తెచ్చి బోర్లు వేసి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కాలిపోతున్న మోటార్లు.. ఎండిపోతున్న పంటలు! - కామారెడ్డి జిల్లా వార్తలు
కామారెడ్డి జిల్లా పరిధిలోని సాగుభూములను సస్యశ్యామలం చేసే దిశగా బీర్కూర్ మండలం చించొల్లి గ్రామంలో నిర్మించిన పోచారం ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారింది. ఎనిమిది నెలల క్రితం మోటార్లు చెడిపోగా.. ఇప్పటికీ మరమ్మత్తులు చేపట్టలేదు. సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయని.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పటి ప్రభుత్వం రూ.4.11 కోట్లతో 2015 సెప్టెంబర్ నెలలో చించొల్లి గ్రామంలో పోచారం ఎత్తిపోతల పథకం కింద ప్రాజెక్టు నిర్మించింది. ప్రాజెక్టు పరిధిలోని మంజీర నదిలో నాలుగు ఊటబావులున్నాయి.వాటిలోంచి నీళ్లు తోడేందుకు ఎనిమిది మోటార్లు ఏర్పాటు చేశారు. పవర్ కంట్రోలర్ నుంచి నదిలోని ఊట బావుల్లో 1.5 కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు వేశారు. అయితే.. విద్యుత్ సమస్య వల్ల తరచూ మోటార్లు కాలిపోతున్నాయి. లోవోల్టేజీ హైవోల్టేజ్ వల్ల ఎనిమిది నెలల క్రితం 7 మోటార్లు కాలిపోయాయి. ప్రస్తుతం కేవలం ఒక్క మోటార్ మాత్రమే ఉంది. నీటిని ఎత్తిపోసేందుకు ఆ ఒక్క మోటారు సరిపోవడం లేదని.. అధికారులు స్పందించి మోటార్లు రిపేర్ చేయించి తమ పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి:శాసన మండలిలో రెవెన్యూ బిల్లుకు ఆమోదం