కామారెడ్డి మండలం సరంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకని వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయాడు. సరంపల్లి గ్రామానికి చెందిన శివ అనే యువకుడు బుధవారం రాత్రి పట్టణంలోని పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లాడు. గురువారం ఉదయమైనా శివ ఇంటికి రాకపోవటం వల్ల కుటుంబసభ్యులు చెరువంతా గాలించగా.. ఎక్కడా కన్పించలేదు.
చేపలు పడదామని వెళ్లాడు.. శవమై తేలాడు - crime news
చేపల వేటకని వెళ్లిన యువకుడు రెండు రోజుల తర్వాత చెరువులో శవమై తేలిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడు సరంపల్లి గ్రామానికి చెందిన శివ(24)గా పోలీసులు గుర్తించారు.
చేపలు పడదామని వెళ్లాడు.. శవమై తేలాడు
ఈరోజు ఉదయం శవం పైకి తేలగా... చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకుని మృతదేహం శివదేనని గుర్తించారు. కుటుంబసభ్యులకు ఈ విషయం తెలియజేశారు. పంచనామా నిర్వహించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.