కామారెడ్డి మున్సిపాలిటీలోని కార్మికులను ఇంఛార్జ్ కమిషనర్ శైలజ, డీఎస్పీ లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ కన్నయ్య కలిసి సన్మానించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ ఏ జంకు లేకుండా ప్రజల ఆరోగ్యం, వారి యోగక్షేమాలే ముఖ్యమని.. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పరిశుభ్రతకే ప్రాముఖ్యం ఇచ్చి అన్ని ప్రాంతాలను శుభ్రంచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను వారు కొనియాడారు.
పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ కమిషనర్ సన్మానం
కామారెడ్డి మున్సిపాలిటీ ఇంఛార్జ్ కమిషనర్ శైలజ, డీఎస్పీ లక్ష్మీ నారాయణ, కౌన్సిలర్ కన్నయ్య కలిసి పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. నిత్యావరసర సరుకులను అందజేసి.. వారి సేవలను కొనియాడారు.
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసిన మున్సిపల్ కమిషనర్
అంతేకాకుండా వారికి నెలకు సరిపడ నిత్యావసర సరుకులను అందించారు. మనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ భౌతిక దూరాన్ని పాటించి కరోనా వ్యాప్తిని అరికట్టడమే మనం వారికి ఇచ్చే గొప్ప గౌరవం అని కమిషనర్ శైలజ తెలిపారు.
ఇదీ చూడండి:తగ్గుతున్న వాయుకాలుష్యం.. తేటపడుతున్న నగరాలు