తెలంగాణ

telangana

ETV Bharat / state

నీరు లేక పశువులను అమ్ముకుంటున్న అన్నదాతలు - bulls

వ్యవసాయంలో  రైతులకు వెన్నుదన్నుగా ఉండే పశువులు తాగునీరు, మేత లేక విలవిల్లాడుతున్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్​ నియోజకవర్గంలోని అన్నదాతలు చేసేదేమీ లేక పశువులను అంగట్లో విక్రయిస్తున్నారు.

నీరు లేక పశువులను అమ్ముకుంటున్న అన్నదాతలు

By

Published : Apr 24, 2019, 12:33 PM IST

నీరు లేక పశువులను అమ్ముకుంటున్న అన్నదాతలు

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్, బిచ్కుంద, పిట్లం, పెద్ద కొడగల్, నిజాంసాగర్, మద్నూర్ మండలాల్లో మూగ జీవులకు తాగేందుకు నీళ్లు లేవు. గ్రామాల్లో చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేకపోవడం వల్ల పశువులు దాహార్తితో అలమటిస్తున్నాయి. చేసేదేమీ లేక రైతులు విలువైన ఎద్దులను అంగట్లో తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. మహారాష్ట్రలోని దేగులూర్ పట్టణంలోని పశువుల మార్కెట్లో ఎద్దులను విక్రయిస్తున్నారు. నీళ్లు, మేత లేకపోవటంతో ఎద్దులను విక్రయిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details