తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల నడ్డివిరిచే విధంగా మోదీ పాలన: ఎమ్మెల్సీ కవిత - ఎమ్మెల్సీ కవిత తాజా వార్తలు

భారత్​ బంద్​కు ఎమ్మెల్సీ కవిత మద్దతు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా టేక్రియాల్ చౌరస్తాలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, సురేందర్‌తో కలిసి నిరసనలో పాల్గొన్నారు.

రైతుల నడ్డివిరిచే విధంగా మోదీ పాలన: ఎమ్మెల్సీ కవిత
రైతుల నడ్డివిరిచే విధంగా మోదీ పాలన: ఎమ్మెల్సీ కవిత

By

Published : Dec 8, 2020, 3:37 PM IST

రైతుల నడ్డివిరిచే విధంగా మోదీ ప్రభుత్వ పాలన ఉందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మోదీ వల్ల మరోసారి దేశం మొత్తం రోడ్డెక్కిందన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను అందరూ వ్యతిరేకించాలని కవిత సూచించారు. కామారెడ్డి జిల్లా టేక్రియాల్ చౌరస్తాలో భారత్ బంద్‌కు మద్దతుగా ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, సురేందర్‌తో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. తమను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని భాజపా నేతలు అబద్ధాలు చెప్పారని ఎద్దేవా చేశారు. గులాబీ సైన్యం రైతుల వెన్నంటే ఉంటుందని కవిత భరోసానిచ్చారు.

రైతుల నడ్డివిరిచే విధంగా మోదీ పాలన: ఎమ్మెల్సీ కవిత

ABOUT THE AUTHOR

...view details