తెలంగాణ

telangana

ETV Bharat / state

డబ్బు కారణంగా పెళ్లి ఆగిపోకూడదనే ఈ పథకం: ఎమ్మెల్యే

భిక్కనూరు మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కల్యాణ లక్ష్మి చెక్కులను 42 మంది లబ్ధిదారులకు అందజేశారు. తెలంగాణలో ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి.. డబ్బు కారణంగా ఆగిపోకూడదనే సీఎం కేసీఆర్‌ ఈ అద్భుత పథకాన్ని తీసుకొచ్చారని గోవర్ధన్‌ తెలిపారు.

డబ్బు కారణంగా పెళ్లి ఆగిపోకుడదనే ఈ పథకం: ఎమ్మెల్యే
డబ్బు కారణంగా పెళ్లి ఆగిపోకుడదనే ఈ పథకం: ఎమ్మెల్యే

By

Published : Sep 19, 2020, 7:21 PM IST

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కల్యాణ లక్ష్మి చెక్కులను 42 మంది లబ్ధిదారులకు అందజేశారు. మొత్తంగా రూ. 42 లక్షల 4 వేల 872 చెక్కులను కొత్త జంటలకు అందించారు.

తెలంగాణలో ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి.. డబ్బు కారణంగా ఆగిపోకూడదనే సీఎం కేసీఆర్‌ ఈ అద్భుత పథకాన్ని తీసుకొచ్చారని గోవర్ధన్‌ తెలిపారు. ఇది బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:సీఎం సహాయనిధి: ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details