తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్లారెడ్డిలో లారీ ఢీకొని బాలుడి మృతి - mruthi

రథోత్సవం చూసేందుకు వెళ్లిన నాలుగేళ్ల చిన్నారిని లారీ మృత్యువు రూపంలో కబళించింది. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చోటుచేసుకుంది.

లారీ ఢీకొని బాలుడి మృతి

By

Published : Apr 19, 2019, 8:14 AM IST

లారీ ఢీకొని బాలుడి మృతి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వద్ద జరిగిన రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. గురువారం రాత్రి నాలుగేళ్ల రోహిత్​ను లారీ ఢీకొట్టటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాబు మృతితో ఆగ్రహించిన బంధువులు రోడ్డుపై మృతదేహంతో బైఠాయించారు. రాత్రి రథోత్సవం జరుగుతుండగా ఒక పక్క నుంచి లారీలు వెళ్లడం వల్ల ఈ ఘటన జరిగినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్​కు తరలించినట్లు ఎస్సై కుమార్ రాజా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details