తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR inagurate school in Bibipet : మహేశ్​బాబు కోసం బీబీపేట్​ గ్రామస్థుల ఎదురుచూపులు..

KTR inagurate school in Bibipet : కామారెడ్డి జిల్లా బీబీపేట్​కు​ జూనియర్‌ కళాశాలతో పాటు.. శ్రీమంతుడు మహేశ్​బాబును తీసుకొస్తానని ఆ మండలవాసులకు మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారు. మహేశ్​బాబు సైతం కచ్చితంగా వస్తానని ట్విటర్​ వేదికగా ప్రకటించారు. ఇదంతా జరిగి ఏడాదైనా జూనియర్‌ కళాశాల, శ్రీమంతుడి జాడ లేదు. మరోమారు మంత్రి కేటీఆర్​ పర్యటన నేపథ్యంలో శ్రీమంతుడిని తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

KTR
KTR

By

Published : Jul 14, 2023, 3:14 PM IST

Updated : Jul 14, 2023, 5:04 PM IST

మహేశ్​బాబు కోసం బీబీపేట్​ గ్రామస్థుల ఎదురుచూపులు..

Bibipet people waiting for maheshbabu : గతేడాది కామారెడ్డి జిల్లా బీబీపేట్​లో శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో దాత సుభాష్‌రెడ్డి పాఠశాల నిర్మించారు. ఆ స్కూల్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్​.. బీబీపేట మండలానికి జూనియర్ కళాశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కళాశాల ప్రారంభోత్సవానికి సినీ కథానాయకుడు మహేష్‌బాబును తీసుకొస్తానని మాట ఇచ్చారు.

ఇదే విషయం కేటీఆర్​ ట్విటర్​లో పెట్టగా.. మహేష్‌ బాబు సైతం కచ్చితంగా వస్తానని సమాధానం ఇచ్చారు. దీంతో హీరో మహేష్‌బాబు రాక కోసం గతేడాది నుంచి మండలవాసులు ఎదురు చూస్తున్నారు. మరోసారి కేటీఆర్ తన సొంత నిధులతో నిర్మించిన కోనాపూర్‌ పాఠశాల ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో శ్రీమంతుడిని తీసుకురావాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

బీబీపేట మండలం జనగామకు చెందిన దాత సుభాష్‌రెడ్డి 6 కోట్ల రూపాయలతో కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మించారు. 2021 నవంబర్‌లో మంత్రులు కేటీఆర్​, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. పాఠశాల చాలా బాగా నిర్మించారని, ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే ఇదే పాఠశాలలో జూనియర్ కళాశాలను మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

మరోవైపు మంత్రి కేటీఆర్​ నానమ్మ జ్ఞాపకార్థం సొంత నిధులతో నిర్మించిన కోనాపూర్‌లో ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి రానున్నారు. దీంతో జూనియర్ కళాశాల మంజూరు చేయాలంటూ మండలానికి చెందిన యువత కేటీఆర్​కు పోస్టుకార్డు లేఖలు పంపారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించారు. నేటికీ కళాశాల మంజూరు కాకపోవడంతో యువత, విద్యావేత్తలు హామీ నెరవేర్చాలని కోరుతున్నారు.

బీబీపేట మండల విద్యార్థులు ఇంటర్‌ చదవాలంటే దూరాభారంతో ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డికి లేదంటే 12కిలోమీటర్ల దూరంలోని దోమకొండకు.. లేదంటే 15కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేట జిల్లా దుబ్బాకకు, 20కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్‌ జిల్లా రామాయంపేటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.

దూరాభారంతో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్‌ చదివేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. మండల కేంద్రంలో కళాశాల ఏర్పాటుతో విద్యార్థుల అవస్థలు తీరిపోతాయని స్థానిక యువత అంటోంది. గతేడాది మంత్రి కేటీఆర్‌ మండలానికి వచ్చినప్పుడు జూనియర్‌ కళాశాల హామీ ఇచ్చారని.. మళ్లీ వస్తారన్న వార్తల నేపథ్యంలో ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు. మండల కేంద్రంలో కళాశాల ఏర్పాటుతో విద్యార్థుల అవస్థలు తీరిపోతాయని స్థానిక యువత అంటోంది.

ఇవీ చదవండి :

Last Updated : Jul 14, 2023, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details