KTR Election Campaign in Kamareddy : తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఇవాళ చివరి రోజు అయినందున బీఆర్ఎస్ నేతలు సభలు, కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలతో బీజీగా ఉన్నారు. కేసీఆర్ బరిలో నిలిచిన కామారెడ్డి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ (KTR) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ మాట్లాడిన ఆయన కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని తెలిపారు. ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తానే పూర్తిగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌కు (KCR) లోకల్, నాన్ లోకల్ అని ఉంటుందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ మినహా.. ఏ రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు పింఛన్లు లేవని గుర్తు చేశారు.
'గజ్వేల్ ఒక రోల్ మోడల్‌గా ఎదిగింది - 24 ఏళ్లుగా తెలంగాణ ఆశగా, శ్వాసగా బతుకుతున్నా'
KTR Road Show At Kamareddy : బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. బీజీ కార్మికులకు పింఛను కటాఫ్ డేట్‌ను తొలగిస్తామని మాట ఇచ్చారు. రాష్ట్రంలో 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు పింఛను ఇస్తున్నామని తెలిపారు. ఈ తొమ్మిదిన్నరేళ్లలో దేశానికి, తెలంగాణకు మోదీ (Modi) చేసింది శూన్యమని మండిపడ్డారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. బీడీ కార్మికులకు ఇచ్చే ఫించన్‌ను దశలవారిగా రూ.5వేలకు పెంచుతామన్న ఆయన.. జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి అన్నపూర్ణ పథకం కింద అందరికి సన్నబియ్యం ఇస్తామని తెలిపారు.
55 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు రైతుకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన ఇప్పుడు వచ్చిందా : కేటీఆర్
"ఆరు నెలలకో సీఎం మారే మార్పు కావాలా? సిరిసిల్ల ఉరిసిల్లగా మారే మార్పు కావాలా? రైతుబంధు బందయ్యే మార్పు కావాలా? మార్పు కావాలి.. అందుకే తెలంగాణ తెచ్చుకున్నాం. ఒకసారి అందరూ తెలంగాణను ఎందుకు తెచ్చుకున్నామో అందరు ఆలోచించాలి." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వహాక అధ్యక్షుడు