కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారు నివసించే ప్రాంతాల్లో కలెక్టర్ శరత్ పర్యటించారు. కరోనా కటడ్డిపై, అధికారుల తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.
'ప్రజలు సహకరించాలి... లేకుంటే చట్టరీత్యా చర్యలే' - కామారెడ్డి కలెక్టర్
బాన్సువాడలో కరోనా పాజిటివ్ వచ్చిన వారు నివసించే ప్రాంతాల్లో కలెక్టర్ శరత్ పర్యటించారు. అనంతరం అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.
'ప్రజలు సహకరించాలి... లేకుంటే చట్టరీత్యా చర్యలే'
మర్కజ్‌కు వెళ్లిన నలుగురితో పాటు... వారి కుటుంబ సభ్యులు ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. వారిని కార్వెంటైన్కు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కరోనా సోకిన వ్యక్తులకు కాంటాక్ట్ అయిన వారిని గుర్తిస్తున్నామని తెలిపారు. ప్రజలు జిల్లా యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. సూచనలను పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:లాక్డౌన్ పట్టించుకోని పాస్టర్లు... అరెస్టు చేసిన పోలీసులు