తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టర్​ సుడిగాలి పర్యటన... అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం - kamareddy collector sharat kumar suddent visit in villages

కామారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్​ శరత్​కుమార్​ సుడిగాలి పర్యటన చేశారు. హరితహారం కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠాధామాలను పరిశీలించిన కలెక్టర్​... పనుల జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

kamareddy collector sharat kumar suddent visit in villages
కలెక్టర్​ సుడిగాలి పర్యటన... అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

By

Published : Jul 22, 2020, 7:59 PM IST

కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలో జిల్లా కలెక్టర్​ శరత్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల కోసం ఏర్పాటు చేసిన ట్రీగార్డులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవైనా జంతువులు లాగితే ఉడిపోయే విధంగా ఉన్నాయని అధికారులపై మండిపడ్డారు.

వైకుంఠధామం పనుల్లో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్​... వేగం పెంచాలని ఆదేశించారు. వైకుంఠధామం చుట్టుపక్కల పూల చెట్లు పెంచాలని సూచించారు. అనంతరం రాజంపేట్, తలమడ్ల, తిప్పాపూర్, బిక్నూర్ గ్రామాల్లోని వైకుంఠ ధామం, రైతువేదికల నిర్మాణాలను కలెక్టర్​ పరిశీలించారు.

ఇదీ చూడండి:గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్​ఐఆర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details