అఖిలపక్ష పార్టీల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట అఖిల పక్ష నేతలు నిరసన చేపట్టారు. మేధావులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందని నేతలు ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. దిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన విద్యార్థుల పోరాటంలో పాల్గొని మద్దతు తెలిపినందుకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, జయతిఘోష్, ఇతర మేధావులు, జర్నలిస్టులపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.