కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన కోడూరి పరశురాం గౌడ్... హైదరాబాద్ జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ విద్యనభ్యసించాడు. ఏటా గ్రామంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతులను నెలకొల్పే పరశురాం... ఈ సారి ప్రత్యేకంగా ఉండాలని వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పర్యావరణానికి ముప్పు లేకుండా పేపర్తో గణపతి ఎందుకు తయారు చేయకూడదని ఆలోచించాడు.
వినూత్న ఆలోచనకు శ్రీకారం... పేపర్ గణేశుడు ప్రత్యక్షం - ganesh idols
గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఈ సారి భారీ విగ్రహాలకు అనుమతి లేకపోవటం వల్ల యువత వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. ఆ ఆలోచనలకు పర్యావరణ పరిరక్షణ సైతం తోడైతే... ఇంకేముంది ఎకో- గణేశ్ తయారైనట్లే. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డికి చెందిన ఓ యువకుడు పేపర్ గణపతిని తయారు చేసి ఆకర్షిస్తున్నాడు.
ganesh idol made with paper in bikkanuru mandal
సుమారు వారం రోజుల పాటు తన ఆలోచనకు పదును పెట్టాడు. కొంత మంది స్నేహితుల సహకారం తీసుకుని పేపర్తో ప్రత్యేక వినాయకుడిని తయారు చేశాడు. ప్రస్తుతం ఆ వినాయకుడు ప్రస్తుతం ప్రత్యేకత సంతరించుకుంది. పేపర్తో గణపతిని తయారు చేసిన తయారు చేసిన పరశురాంను పలువురు అభినందించారు.