కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని రాంపూర్ తండాకు చెందిన ధరావత్ బాల్ సింగ్ (50) వ్యవసాయ క్షేత్రంలో నాలుగు బోర్లు వేసి నీళ్లు పడకపోవడం వల్ల అప్పుల పాలయ్యాడు. అతనికి ఇద్దరు భార్యలు ఉండటం వల్ల తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. దీనికి తోడు అప్పుల భారం పెరగడం వల్ల బుధవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... పరిస్థితి విషమించడంతో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - kamareddy district news
అప్పుల బాధ భరించలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా రాంపూర్ తండాలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. తమ్ముడు బలరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. మృతుడి పెద్ద భార్యకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు, చిన్న భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇవీ చూడండి: విషాదం... శ్మశానంలోనే వృద్ధురాలి ఆత్మహత్య