కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ విడుదల చేసిన లేఖలో ఆ పార్టీ అధిష్ఠాన వైఖరిని తప్పు పట్టారు. త్వరలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరనున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి... గులాబీ దళపతితో కలిసి నడుస్తానని వెల్లడించారు. మొదటి నుంచి తెరాసతో అనుబంధం ఉందని... కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పుడు మరోసారి గులాబీ బాస్‌తో కలిసి నడుస్తానని స్పష్టం చేశారు.
తెరాస గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ - CONGRESS]
కాంగ్రెస్‌కు మరో ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హస్తం పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న జాజుల సురేందర్ తెరాసలోకి వెళ్లడం వల్ల ఇందూరు కాంగ్రెస్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు.
తెరాస గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్
Last Updated : Mar 28, 2019, 10:46 AM IST