తెలంగాణ

telangana

ETV Bharat / state

సఖి కేంద్రాన్ని పర్యవేక్షించిన కామారెడ్డి కలెక్టర్ - SAKHI CENTER

కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సఖి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సందర్శించారు. సఖి కేంద్రాల సేవలను మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాలని సూచించారు.

సఖి కేంద్రాన్ని పర్యవేక్షించిన కామారెడ్డి కలెక్టర్

By

Published : Sep 23, 2019, 1:53 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సఖి కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ పర్యవేక్షించారు. బాధితులందరికీ చేయూతనివ్వాలని.. సిబ్బంది ప్రజలందరికీ సహకరించాలని సూచించారు. సఖి కేంద్రాల సేవలను బాన్సువాడ, ఎల్లారెడ్డి ప్రాంతాలకు కూడా విస్తరించాలని ఆదేశించారు. మారుమూల ప్రాంతాలలోని స్త్రీలు తమకు జరిగిన అన్యాయాలను బయటకు చెప్పుకోలేక పోతున్నారని... అలాంటి వారికి సఖి కేంద్రాలు ధైర్యాన్ని ఇచ్చి అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు.

సఖి కేంద్రాన్ని పర్యవేక్షించిన కామారెడ్డి కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details