తెలంగాణ

telangana

'అశ్లీలతపై ప్రశ్నిస్తే భౌతిక దాడులా ?'

By

Published : Jan 6, 2021, 7:07 PM IST

అశ్లీలతపై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడతారా అని బీజేవైఎం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆముదాల నరేందర్ ప్రశ్నించారు. ఓటీటీలో డర్టీ హరి చిత్ర ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లనే ఇలాంటి సినిమాలు వస్తున్నాయని విమర్శించారు.

bjym leaders protest in kamareddy district
అశ్లీలతపై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడుతున్నారు

అశ్లీలతపై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడతారా అని భాజపా యువమోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆముదాల నరేందర్ ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వ అసమర్థ విధానాల వల్లనే ఇలాంటి సినిమాలు వస్తున్నాయని విమర్శించారు. ఓటీటీ వేదికగా విడుదలైన డర్టీ హరి చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. సికింద్రాబాద్​లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్​పై దాడి చేయడం అప్రజాస్వామికమని అన్నారు.

ఇలాంటి సినిమాలకు మద్దతు పలికి సభ్యసమాజానికి సీఎం కేసీఆర్​ ఏం మెసేజ్‌ ఇస్తున్నారని ప్రశ్నించారు. యువతను తప్పుదారి పట్టించే ఇలాంటి చిత్రాలను నిషేధించాలని డిమాండ్​ చేశారు. ఆ చిత్ర నిర్మాత రామారావుపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:ఉపాధి హామీ ఫిర్యాదుల పరిష్కారానికి అంబుడ్స్​మెన్

ABOUT THE AUTHOR

...view details