ETV Bharat / spiritual

ఈ రోజు ఆ రాశుల వారికి ధన లాభం - పదోన్నతి ఖాయం! - Horoscope Today

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 4, 2024, 4:30 AM IST

Horoscope Today July 4th, 2024 : జులై​ 4న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Horoscope Today July 4th, 2024 (ETV Bharat)

Horoscope Today July 4th, 2024 : జులై​ 4న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అదృష్టం అవకాశాల రూపంలో ఈ రోజు మీ తలుపు తడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు తమ తమ రంగాలలో సువర్ణావకాశాలు అందుకుంటారు. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పలు మార్గాల ద్వారా ధనాదాయం ఉంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు. వ్యాపారులు ఈ రోజు వ్యాపార రంగంలో తమకంటూ కొత్త మైలురాయి సృష్టించుకుంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. క్లిష్టమైన పరిస్థితులను మీకు అనుగుణంగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది. ప్రతికూల ఆలోచనలు వీడండి. దుర్గాదేవి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉండవచ్చు. పనులు సకాలంలో పూర్తి చేయడానికి అవరోధాలు ఏర్పడతాయి. సన్నిహితులు మిమ్మల్ని అపార్ధం చేసుకునే పరిస్థితులు కలుగుతాయి. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి. శివారాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల వారికి తమ తమ రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. కీలక వ్యవహారాల్లో సర్డుబాటు ధోరణితో ఉంటే త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండక నిరాశకు గురవుతారు. మీరంటే గిట్టని వారి నుంచి వృత్తి పరంగా ప్రమాదం ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడితో ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపిస్తుంది. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పారాయణ చేయడం మంచిది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మంచి రోజులు వచ్చేసాయి. ఇన్ని రోజుల మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకోనున్నారు. అన్ని రంగాల వారిని అదృష్టం వరిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ కార్యసిద్ధి, విజయప్రాప్తి ఉంటాయి. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. బంధు మిత్రుల నుంచి లబ్ది పొందుతారు. సంతానం భవిష్యత్ పట్ల దిగులు, విచారం చోటు చేసుకుంటాయి. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో శుభ ఫలితాలు ఉంటాయి.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. న్యాయపరమైన వివాదాలను కోర్టు బయట పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలకు ముగింపు లభించవచ్చు. పలు మార్గాల ద్వారా ధనాదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు, జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులన్నీ ఒకేసారి రావడంతో హడావుడిగా ఉంటారు. అయితే సమర్ధవంతంగా అన్ని పనులు పూర్తి చేసి ఇంటా, బయటా శభాష్ అనిపించుకుంటారు. నూతన ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఓ కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళతారు. వ్యాపారులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్ధికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సమాజంలో గౌరవం, కీర్తి పెరుగుతాయి. ఈశ్వర ఆరాధన శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగం కూడా ప్రమాదంలో పడే పరిస్థితి రావచ్చు. ఇన్ని రోజులు గోప్యంగా ఉంచిన కొన్ని విషయాలు వెల్లడించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండండి. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. గురు శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఇతరులు ఆశించిన మేరకు మీ పనితనం ఉండకపోవచ్చు. పని పట్ల ఏకాగ్రత అవసరం. నైపుణ్యాలు మెరుగు పరచుకుంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. బంధువర్గంలో అవమానం కలిగే సంఘటనలు ఏర్పడవచ్చు. సందర్భానుసారం నడుచుకుంటే మంచిది. శని స్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు, వృత్తినిపుణులకు లాభదాయకమైన రోజు. మంచి లాభాలతో పాటు పదోన్నతి పొందే సూచనలు కూడా ఉన్నాయి. చేపట్టిన పనులలో విజయం చేకూరుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పనిభారం పెరుగుతుంది. తీవ్రమైన ఒత్తిడితో ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఔషధ సేవనం తప్పకపోవచ్చు. బంధు మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. రచయితలకు, కళాకారులకు ప్రభుత్వం నుంచి సన్మాన, సత్కారాలు జరుగవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.