కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులో ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బాన్సువాడ మండలం తడకొల్కు చెందిన సురేశ్... బోధన్ వెళ్తున్నాడు. దుర్కి గ్రామ శివారులో ఒక్కసారిగా ద్విచక్రవాహనం అదుపు తప్పి పడిపోయాడు.
బైక్ అదుపుతప్పి ప్రమాదం... యువకునికి తీవ్ర గాయాలు - కామారెడ్డిలో బైక్ ప్రమాదం
ద్విచక్రవాహనం అదుపుతప్పి కామారెడ్డి జిల్లా దుర్కి గ్రామ శివారులో ప్రమాదం జరిగింది. ఘటనలో వాహనదారునికి తీవ్రగాయాలు కాగా... బాన్సువాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
BIKE ACCIDENT AT BANSUWADA MANDAL
ప్రమాదంలో సురేశ్‌కు తీవ్రగాయాలు కాగా... స్థానికులు వెంటనే 108కి సమాచామిచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలు కాగా... పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడి అరెస్టు