అయోధ్యలో రామ మందిరం నిర్మిచాలన్న ఆలోచనతో బెంగళూరులో చేపట్టిన 2000 కిలోమీటర్ల పాదయాత్ర నేడు కామారెడ్డికి చేరుకుంది. శ్రీ రామ సేన కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో వారికి ఘనస్వాగతం పలికారు. అయోద్యలో రామ మందిరం నిర్మించాలని ఆగస్టు 16న ఈ పాదయాత్ర ప్రారంభించారు. కర్ణాటక, ఆంధ్ర మీదుగా కామారెడ్డికి చేరుకున్నారు. రామ నామ జపంతో నవంబర్ 1న అయోధ్యకు చేరుతామని స్పష్టం చేశారు.
కామారెడ్డికి చేరుకున్న బెంగళూరు పాదయాత్ర - కర్ణాటక, తెలుగు రాష్ట్రాల ప్రజలు
రామ మందిరం నిర్మించాలని బెంగళూరులో ప్రారంభించిన 2 వేల కిలోమీటర్ల పాదయాత్ర ఇవాళ కామారెడ్డికి చేరుకుంది. కర్ణాటక, తెలుగు రాష్ట్రాల ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
కామారెడ్డికి చేరుకున్న బెంగళూరు పాదయాత్ర