రెండో సారి అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆ మాటే మర్చిపోయారని కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గ సీపీఐ ఇంఛార్జి రాములు అన్నారు.
'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరిచాయి' - బాన్సువాడ నియోజకవర్గ సీపీఐ ఇంఛార్జి రాములు
తెరాస, భాజపా పార్టీలు పెట్టుబడిదారుల ప్రయోజనాలకోసమే పనిచేస్తున్నాయని, ప్రజా సంక్షేమాన్ని మరిచాయని బాన్సువాడ నియోజకవర్గ సీపీఐ ఇంఛార్జి రాములు అన్నారు. తెరాస రాచరిక పాలన చేస్తోందని మండిపడ్డారు.
'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరిచాయి'
తెరాస, భాజపాలు ప్రజా సంక్షేమాన్ని మరిచి, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయని రాములు ఆరోపించారు. బాన్సువాడ మండల భవన నిర్మాణ ఆవిర్భావ సభలో పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వప్రయోజనాలు మాని, ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని రాములు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీటీయూ డివిజన్ కన్వీనర్ శంకర్, సీపీఐ నాయకులు శివాజీ, నాగరాజు, సురేశ్ పాల్గొన్నారు.