కామారెడ్డిలో పదో తరగతి అమ్మాయి అదృశ్యం కలకలం రేపుతోంది. దేవునిపల్లిలోని ఇంటి నుంచి సోమవారం సాయంత్రం బయటకెళ్లిన శాయిస్తా... ఇప్పటి వరకూ ఆచూకీ లేదు. అక్షర పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది అమ్మాయి.
కామారెడ్డిలో పదో తరగతి అమ్మాయి అదృశ్యం - CRIME NEWS IN TELANAGAN
సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన అమ్మాయి... 24 గంటలు గడిచినా తిరిగి రాలేదు. తీవ్ర ఆందోళన పడుతున్న ఆ తల్లిదండ్రులు తెలిసిన చోట్లలో గాలించినా ఫలితం దక్కలేదు. కుమార్తె కోసం కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది.
10th CLASS GIRL MISSING IN KAMAREDDY
నిన్న సాయంత్రం అదృశ్యమైన తమ కూతురు ఇప్పటిదాకా కన్పించకుండా పోవటం వల్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రులు, బంధువులు అన్ని ప్రాంతాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు. ఫలితం లేకపోవటం వల్ల దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.