జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో వర్షాలు పడకపోవడ వల్ల గ్రామస్థులు వినూత్న చర్యలు చేస్తున్నారు. జొన్నలు పోసిన రాగిచెంబుపై చాటను ఉంచి... దానిపై 12 సంవత్సరాల బాలుడిని కూర్చోబెట్టి ధూపం వేశారు. కార్తుల పేర్లు వినిపించారు. ఏ కార్తి పేరు వద్ద చాట వేగంగా తిరుగుతుందో... అప్పుడు వర్షం పడుతుందన్న వారి నమ్మకం. ఆగస్టులో వచ్చే పబ్బ, హస్త కార్తులలో వర్షం పడుతుందని చాట చక్రం ద్వారా తేలిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
కాలచక్రాన్ని తెలిపే 'చాట చక్రం'
అవసరమో... ఆచారమో... మూఢాచారమో... వరుణిడి రాక కోసం ఆ గ్రామం ఎదురుచూస్తోంది. ఏ కార్తీలో వర్షం పడుతుందో తెలుసుకునేందుకు జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో గ్రామస్తులు చాటను నమ్ముకున్నారు.
కాలచక్రాన్ని తెలిపే 'చాట చక్రం'