జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో బీచుపల్లి, కొండపేట, ఏక్తాపూర్ ప్రాంతాలలో జడ్పీ ఛైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం పర్యటించారు. వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. బీచుపల్లి, ఏక్తాపూర్ గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిదిగా అధికారులకు సూచించారు. ప్రజలు ఎవరూ భయపడోద్దని ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు.
జోగులాంబ జిల్లాలో పలు గ్రామాలు జలమయం - గ్రామాలు
తెలంగాణలో వర్షాలు పడకున్నా ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరద మూలంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పలు గ్రామాలు జలమయం అయ్యాయి. బీచుపల్లి శివాలయం, కోదండ రామాలయం నీటితో నిండాయి.
జోగులాంబ జిల్లాలో పలు గ్రామాలు జలమయం