తెలంగాణ

telangana

ETV Bharat / state

మాకు ఓపీఎస్​ ముద్దు.. సీపీఎస్​ వద్దు - ర్యాలీ

సామాజిక భద్రత లేని సీపీఎస్​ విధానాన్ని రద్దు చేయాలని టీఎస్​సీపీఎస్​ఈయూ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ విధానం ఉండటం వల్ల  ఎవరైన ఉద్యోగి హఠాత్తుగా మరణిస్తే వారి కుటుంబం రోడ్డున పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షా 50 వేల కుటుంబాలపై ఉంటుందన్నారు.

మాకు ఓపీఎస్​ ముద్దు.. సీపీఎస్​ వద్దు

By

Published : Aug 24, 2019, 12:07 AM IST

మాకు ఓపీఎస్​ ముద్దు.. సీపీఎస్​ వద్దు
జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద టీఎస్​సీపీఎస్​ఈయూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సీపీఎస్​ను​ రద్దు చేసి పాత పింఛను (ఓపీఎస్​) విధానాన్ని కొనసాగించాలని ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. సీపీఎస్​ విధానం ఉండటం వల్ల ఎవరైన ఉద్యోగి హఠాత్తుగా మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షా 50 వేల కుటుంబాలపై ఉంటుందని ఆందోళన చెందారు. గత ఐదేళ్లుగా నిరసన తెలుపుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని సీపీఎస్​ ఉద్యోగులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details