జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం రాజపురం గ్రామంలో అంగన్వాడీ పాఠశాల గోడ కూలి మూడు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. వీరుపాక్షమ్మ, గోపాల్ కుమారుడు అంగన్వాడీ భవనం దగ్గర వరండాలో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా కొత్తగా నిర్మించిన గోడ కూలిపోయింది. ఈ ఘటనలో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. పసిబాలుడు చనిపోవటం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.
గోడ కూలి బాలుడు మృతి - Three years boy killed in a wall collapses in Jogulamba gadwal district
జోగులాంబ గద్వాల జిల్లా రాజపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో అప్పటి వరకూ సంతోషంగా అడుకుంటున్న ఆ బాలుడిని ప్రహారీ గోడ రూపంలో మృత్యువు కబలించింది.
గోడ కూలి బాలుడు మృతి
TAGGED:
గోడ కూలి బాలుడు మృతి