జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మరో ప్రత్యేకతను చాటుకుంది. అమ్మవారు కొలువైన ఈ జిల్లాలో అలంపూర్ మండలంలో అన్ని స్థానాలను మహిళలే గెలుచుకున్నారు. ఇక్కడ పురుషులను కాదని రిజర్వేషన్లకు అతీతంగా జనరల్ స్థానాల్లోనూ అతివలకే పట్టం కట్టారు. మండలంలోని జడ్పీటీసీ, 6 ఎంపీటీసీ, ఎంపీపీ, వైఎంపీపీ పదవులన్నింటిలో మహిళలే విజయం సాధించారు. జడ్పీటీసీగా ఇస్మాయిల్ బేగం ఎన్నికవ్వగా.. ఎంపీపీగా పింజరి బేగం, వైస్ ఎంపీపీగా అనురాధ గెలిచారు.
అలంపూర్ మండల పరిషత్లో అందరూ అతివలే - ALAMPUR
అమ్మవారు కొలువైన జోగులాబం గద్వాల జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రత్యేకతను చాటుకుంది. అలంపూర్ మండలంలోని అన్ని పదవులకు అతివలనే ఎన్నుకున్నారు.
అలంపూర్ మండల పరిషత్లో అందరూ అతివలే