తెలంగాణ

telangana

ETV Bharat / state

గద్వాల జిల్లా కేంద్రంలో స్పీడ్​ గన్​లు - SPEED GUNS

రోడ్డుపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు గద్వాల పోలీసులు స్పీడ్​ గన్​లను ప్రారంభించారు. జిల్లా ఏర్పడిన తర్వాత వాహనాల సంఖ్య పెరిగి అతివేగంతో వెళ్తున్నాయని.. వాటికి అడ్డుకట్ట వేయడానికే ఈ స్పీడ్​ గన్​లని ఏస్పీ లక్ష్మీ నాయక్​ తెలిపారు.

గద్వాల జిల్లా కేంద్రంలో స్పీడ్​ గన్​లు

By

Published : Jun 18, 2019, 4:56 PM IST

గద్వాల జిల్లా కేంద్రంలో స్పీడ్​ గన్​లు
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్పీ లక్ష్మీ నాయక్, ఏఎస్పీ కృష్ణ స్పీడ్ గన్లను ప్రారంభించారు. గద్వాల.. జిల్లా ఏర్పడ్డాక వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగి.. మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల రెండు స్పీడ్​ గన్​లు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ఈ స్పీడ్​ గన్​లలోని ఆటోమేటిక్​ పద్దతి ద్వారా.. వాహనాల వేగాన్ని కనిపెట్టి సంబంధిత వాహనాదారులకు ఎస్​ఎంఎస్​ రూపంలో జరిమానా వెళ్తుందని లక్ష్మీ నాయక్​ పేర్కొన్నారు. ఒక వాహనానికి 1400 జరిమానా నిర్ణయించామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details